ములుగు, వెలుగు : లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని ములుగు ఎస్పీ శబరీశ్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గుపాడుకు చెందిన మావోయిస్టు సెక్షన్ కమాండర్ నూప భీమ అలియాస్ సంజు, అతడి భార్య ముచకి దుల్దో అలియాస్ సోని ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దీంతో వారిపై ఉన్న రివార్డును అందజేసిన అనంతరం ఎస్పీ మాట్లాడారు.
ప్రజాస్వామ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబంతో జీవించాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్‌కుమార్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు.