ములుగు, వెలుగు : మేడారం జాతర టైంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ చెప్పారు. ట్రాఫిక్ మళ్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం వద్ద పరిసరాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం అనుభవం గల పోలీస్ ఆఫీసర్లు
సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రిపేర్లకు గురయ్యే వాహనాలను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గట్టమ్మ ఆలయం చుట్టుపక్కల ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారే దుకాణాలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.