ములుగు, వెలుగు : సమన్వయంతో పనిచేసి మేడారం జాతరను సక్సెస్ చేద్దామని ములుగు ఎస్పీ శబరీశ్ చెప్పారు. ములుగు జిల్లా ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే టైంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు సైతం సరిదిద్దుకుంటున్నామన్నారు. ఆఫీసర్లు, పోలీసుల సూచనలను భక్తులు పాటిస్తూ అమ్మవార్లన క్షేమంగా దర్శించుకోవాలని చెప్పారు.
ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని, ఓవర్ టేక్ చేసి ప్రమాదాలకు గురికావొద్దని సూచించారు. మేడారం తరలివచ్చే భక్తులకు దూరభారం తగ్గించేందుకు అమ్మవార్ల గద్దెలకు సమీపంలోనే మరో 100 ఎకరాలను గుర్తించామన్నారు. మహాజాతర సక్సెస్‌లో మీడియా ప్రతినిధుల సహకారం ఎంతో కీలకమన్నారు. భక్తులు సజావుగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని చెప్పారు.