ఏపీలోని వర్సిటీని సందర్శించిన ములుగు ట్రైబల్ వర్సిటీ వీసీ

ఏపీలోని వర్సిటీని సందర్శించిన ములుగు ట్రైబల్ వర్సిటీ వీసీ

ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క, సారలమ్మ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్​చాన్సలర్​ వైఎల్ శ్రీనివాస్​ మంగళవారం ఆంధ్రాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించారు. విజయనగరంలోని వర్సిటీ వీసీ కేటీ కట్టిమణిని కలిసి పాలనాపరమైన అంశాలపై చర్చించారు. భవనాలను పరిశీలించారు అమలు చేస్తున్న కోర్సులు, టీచింగ్​స్టాఫ్​, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు.

ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై సమీక్షించారు. వర్సిటీ మాస్టర్ ప్లాన్లో  భాగంగా ఆంధ్రాలోని ట్రైబల్ వర్సిటీని సందర్శించినట్టు  వీసీ శ్రీనివాస్ తెలిపారు.  ఆయన వెంట హైదరాబాద్​ సెంట్రల్ వర్సిటీ అసిస్టెట్​ప్రొఫెసర్​, ములుగు ట్రైబల్ వర్సిటీ నోడల్ ఆఫీసర్ వంశీ తదితరులు ఉన్నారు.