
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా కాసేపటి క్రితం చనిపోయాడు. గతంలో కూడా గుండెపోటు రావడంతో జగదీష్ చికిత్స తీసుకున్నారు.
జగదీశ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారని కేసీఆర్ అన్నారు.