విజయవాడకు ముంబై నటి జత్వాని.. సీపీతో భేటీ

ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న ముంబై నటి జత్వాని అంశం కీలక మలుపు తిరిగింది. శుక్రవారం ఉదయం ముంబై నుండి విజయవాడ చేరుకున్నారు కాదంబరి జత్వాని. విజయవాడలో కమిషనర్ రాజశేఖర్ ను కలిసి లిఖితపూరిత ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసులు తన కుటుంబాన్ని అక్రమంగా అరెస్టు చేశారని, తప్పుడు కేసులు పెట్టి వేధించారని జత్వాని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది.

Also Read:-గర్ల్స్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాపై ఉద్రిక్తత

ఇదిలా ఉండగా, జత్వాని గురువారం ( ఆగస్టు 29,2024 ) ముంబై నుండి స్పెషల్ ఫ్లైట్  లో హైదరాబాద్ చేరుకొని రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం రోడ్డు మార్గాన విజయవాడ చేరుకున్నారు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ముంబై బెదిరింపులు ఆరోపణలు ఎదుర్కుంటూ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న జత్వానికి ప్రభుత్త్వం రక్షణ కల్పిస్తోందని ఆరోపిస్తోంది.