లైన్ క్లియర్..ముంబై పేలుళ్ల నిందితుడు రాణా అప్పగింతకు అమెరికా ఓకే

లైన్ క్లియర్..ముంబై పేలుళ్ల నిందితుడు రాణా అప్పగింతకు అమెరికా ఓకే

వాషింగ్టన్: ముంబై దాడుల సూత్రధారి, పాక్ టెర్రరిస్టు తహవుర్ రాణా అప్పగింతకు రూట్ క్లియర్ అయింది. తనను భారత్ కు అప్పగించొద్దంటూ రాణా పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు తాజాగా తోసిపుచ్చింది. 

ముంబై పేలుళ్లకు సంబంధించిన కేసులో నేరస్థుల అప్పగింత నుంచి మినహామయింపు పొందలేరని స్పష్టం చేసింది. ఫెడరల్ కోర్టుల తీర్పును సమర్థించింది. ఈమేరకు ఈ నెల 21న అమెరికా సుప్రీంకోర్టు రాణా పిటిషన్ను కొట్టివేసింది. 

కాగా, 2008లో జరిగిన ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవుర్ రాణాను విచారించేందుకు తమకు అప్పగించాలని అమెరికాకు కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో తహవుర్ రాణాను భారత్కు అప్పగించే విషయంలో అడ్డంకులన్నీ తొలగినట్లైంది.