
2008ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తావుర్ రానాను ఇండియాకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాణాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా ఒప్పుకుంది..రాణాను ఇండియాకు తీసుకొచ్చేందుక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం (ఏప్రిల్9) రాత్రి లేదా గురువారం ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో రాణాను ఇండియా తీసుకురానున్నట్లు అమెరికాలోని సీనియర్ ఇండియన్ సెక్యూరిటీ అధికారి స్పష్టం చేశారు.
డీఐజీ స్థాయి గల NIA అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఇండియన్ ఏజెన్సీ టీం ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. రాణా అప్పగింత ప్రాసెస్ అంతా పూర్తియింది.లీగల్ ఫార్మాలిటీస్, పేపర్ వర్క్ అంతా అయిపోయిందని అధికారులు తెలిపారు. రాణా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోని మెట్రో పాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్నారు.
►ALSO READ | US News: ఆందోళనలో 3 లక్షల భారత స్టూడెంట్స్.. వర్క్ వీసాలకు ట్రంప్ గుడ్ బై..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణాను ప్రత్యేక ప్రైవేట్ విమానంలో ఇండియాకు తీసుకున్నారు. ఇది ఇంధనంకోసం యూరప్ దిగనుంది. అనంతరం నేరుగా న్యూడిల్లీకి చేరనుంది.