ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ బావ, ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం (డిసెంబర్ 27) గుండె పోటుతో చనిపోయాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ.. షుగర్ కారణంగా లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ALSO READ : విమాన ప్రమాదం వెనుక రష్యా మిసైల్ దాడి..!
2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఉగ్రవాద నిరోధక కోర్టు హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2023లో మక్కీని ఐక్యరాజ్యసమితి గ్లోబర్ టెర్రరిస్ట్ గా గుర్తించింది. మక్కీ ఆస్తులు సీజ్ చేసింది. ప్రయాణం, ఆయుధాలు కలిగిఉండటంపై నిషేధం విధించింది. మక్కీ పాకిస్తాన్ భావజాల వాది అని పాకిస్తాన్ ముతాహమిదా ముస్లిం లీగ్ (PMML) ప్రకటిం చింది.