పెద్ద మనసు చాటుకున్న ఆటోవాలా.. శెభాష్ అంటోన్న నెటిజన్లు

ఒక్కోసారి మనం చేసే సాయం చిన్నదే అయినా అది ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించవచ్చు. ఇలాంటి ఓ చిరు ప్రయత్నమే ఓ ఆటోవాలాను సోషల్ మీడియా స్టార్ ను చేసింది. ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇలాగే మానవత్వం చాటుకున్నాడు. మాడు పగిలే ఎండలను సైతం లెక్క చేయకుండా నిత్యం ఎంతో చదువులు, ఉద్యోగాలు అంటూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. అలా చాలా మందిని తన ఆటోలో వారి గమ్య స్థానానికి చేరుస్తుంటాడు. తన ఆటోలో ప్రయాణించే వారు సేద తీరేలా ఏదైనా చేయాలనుకున్నాడు. తన సీటు వెనుక భాగంలో కొంత స్థలాన్ని కేటాయించి వారి కోసం  ఉచితంగా నీళ్లు, బిస్కెట్ల అందిస్తున్నాడు.  

దీనిని ఫొటో తీసిన ఒకరు ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ముంబై ఆటో వాలాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పోస్టుకు పది లక్షలకు పైగా వీక్షణలతో పాటు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి. సాయం చిన్నదా పెద్దదా అని చూడకుండా అతడు చేస్తున్న పనిని అభినందించి తీరాలంటూ వారు కమెంట్లు చేస్తున్నారు. ఇటువంటివి చూసినప్పుడే మానవత్వం ఇంకా మిగిలే ఉందన్న నమ్మకం కలుగుతుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

https://twitter.com/123_nandini/status/1642740858587070465