
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 23–25 తేదీల్లో ఉంటుంది. ప్రైస్‌బ్యాండ్‌ను రూ.114–రూ.120 మధ్య నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.151 కోట్ల వరకు సమీకరిస్తుంది. ఇందులో 1.26 కోట్ల షేర్ల తాజా ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్ఎస్ పోర్షన్ లేదు. మహారాష్ట్రకు చెందిన మన్బా ఫైనాన్స్‌లో ప్రస్తుతం ప్రమోటర్లకు 100 శాతం వాటా ఉంది. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ భవిష్యత్ మూలధన అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడతారు. ఇష్యూ పరిమాణంలో సగం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15 శాతం షేర్లను నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసినట్లు కంపెనీ తెలిపింది.