10, 11 నంబర్లలో వచ్చి  సెంచరీలు

10, 11 నంబర్లలో వచ్చి  సెంచరీలు
  • ముంబై ప్లేయర్లు తనుష్‌‌, తుషార్ రికార్డు

ముంబై : రంజీ ట్రోఫీలో ముంబై బౌలర్లు తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌ (120 నాటౌట్‌‌‌‌), తుషార్‌‌‌‌ దేశ్‌‌‌‌పాండే (123) రికార్డు సృష్టించారు. ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌‌లో 78 ఏండ్ల తర్వాత  10, 11వ నంబర్లలో బ్యాటింగ్‌‌కు  వచ్చి  సెంచరీలు చేసిన ఇండియా జంటగా నిలిచారు. దాంతో మంగళవారం బరోడాతో ముగిసిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ను డ్రా చేసుకున్న  ముంబై తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యంతో  సెమీస్‌‌‌‌ చేరుకుంది.  ముంబై  ఇచ్చిన 606 రన్స్‌‌‌‌ ఛేజింగ్‌‌లో ఐదో రోజు చివరకు  బరోడా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 121/3 స్కోరు చేసింది.

ప్రియాన్షు మోలియా (54) హాఫ్‌‌‌‌ సెంచరీ చేశాడు. అంతకుముందు 379/9 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 569 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. టెయిలెండర్లు తనుష్, తుషార్ అనూహ్యంగా సెంచరీలు కొట్టారు. భార్గవ్‌‌‌‌ భట్‌‌‌‌ 7 వికెట్లు తీశాడు. కర్నాటకతో మరో క్వార్టర్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో విదర్భ 127 రన్స్‌‌‌‌తో నెగ్గి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టింది. మార్చి 2 నుంచి జరిగే సెమీస్‌‌లో  తమిళనాడుతో ముంబై,   మధ్యప్రదేశ్‌తో విదర్భ  తలపడతాయి.