క్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు

క్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు

చేసేది ప్రభుత్వం ఉద్యోగం..పైగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో..నేరాలను అడ్డుకోవాల్సిన ఉద్యోగం.. అయినా ఓ పోలీసు, ఓ రిటైర్ట్ పోలీస్ ఇద్దరు..ఓ ఇన్ ఫార్మర్, మరొ ఇద్దరితో కలిసి డబ్బు కాజేసేందుకు ప్లాన్ వేశారు. అనుకున్నది సాధించారు.. కానీ ఎంత కేటుగాడైన ఏదో ఓ క్లూ వదలకుండా వెళ్లడుకదా..సీసీటీ వీ కెమెరాలకు చిక్కి చివరికి అడ్డంగా దొరికిపోయాడు.. ముంబైలోని ఓ హోటల్ యజమానిని బెదిరించి రూ.25 లక్షలు ఎత్తుకెళ్లిన పోలీస్,రిటైర్డ్ పోలీస్, ఇన్ ఫార్మర్, మరో ఇద్దరు వ్యక్తుల ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులమని ఓ హోటల్ వ్యాపారి ఇంట్లో చొరబడి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లిన ఆరుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు నరేష్ నాయక్ (44) ఇచ్చి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. 

ముంబై లో ఫేమస్ ఉడిపి రెస్టారెంట్ మాతుంగాలో మహేశ్వరి పార్క్ కు ఎదురుగా ఉన్న ప్రముఖ కేఫ్ మైసూర్ రెస్టారెంట్. దీని ఓనర్ నరేష్ నాయక్. గత కొన్నేళ్లుగా ఈ హోటల్ ను నడుపుతున్నాడు.. అయితే సోమవారం (మే 13) నాడు అతడు ఉంటున్న అపార్టుమెంట్ కు ఆరుగురు వ్యక్తులు  వచ్చి.. ముంబై క్రైం బ్రాంచి నుంచి వచ్చాం.. మీ ప్లాట్ లో అక్రమంగా రూ.17కోట్లు డబ్బు ఉందని మాకు సమాచారం వచ్చింది. ఎక్కడ పెట్టారో చెప్పాలని నరేష్ నాయక్ ను బెదిరించారు. 

దీంతో భయపడిపోయిన నరేష్ నాయక్... తన ఫ్లాట్ లో అంత డబ్బు లేదని..తన వద్ద హోటల్  ద్వారా వచ్చిన రూ. 25 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తాను రోజుకు రూ. 1లక్ష నుంచి రూ. 2 లక్షలు సంపాదిస్తానని వారంచివరలో బ్యాంకులో వేస్తానని చెప్పారు. 

దీంతో ఆ దొంగలు ఫ్లాట్ లోని అన్ని బీరువాలు చెక్ చేసి రూ. 25 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. నరేష్ నాయర్ పై కేసు నమోదు చేస్తాం.. రాజీ పడాలంటేవారికి రూ. 2కోట్లు చెల్లించాలని చెప్పి డబ్బుతో పరారయ్యారు. ఇక్కడ దొంగలు దొంగతనం చేయడానికి పోలీస్ జీపును వాడటం కొసమెరుపు. 

దీంతో నరేష్ సియోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జోన్‌ 4కు చెందిన డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంత్‌ కదమ్‌ వెంటనే రంగంలోకి దిగారు. పోలీసుల బృందాలను ఏర్పాటు చేశారు. CCTV ఫుటేజీని స్కాన్ చేశాడు.నేరానికి ఉపయోగించిన పోలీసు జీప్‌ను వెంటనే గుర్తించాడు.

ప్రస్తుతం పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి, రిటైర్డ్ కానిస్టేబుల్, ఖబ్రీఅంటే ఇన్ ఫార్మర్, మరో ఇద్దరు వ్యక్తును పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ దొంగతనానికి పోలీసు జీపును ఉపయోగించడం. విచారణ చేపట్టిన పోలీసులు నరేస్ నాయర్ ఫ్లాట్ లో డబ్బులు ఉన్నట్లు ఈ కేటుగాళ్లకు ఎవరు సమాచారం ఇచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.