బ్యాంకులకు పరుగులు తీస్తున్న జనం..RBI ఆంక్షలతో డిపాజిట్లపై ఆందోళన

బ్యాంకులకు పరుగులు తీస్తున్న జనం..RBI ఆంక్షలతో డిపాజిట్లపై ఆందోళన

నగదు బదిలీలపై ఆంక్షలతో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు బెంబేలెత్తిపోయారు. ముంబైలోని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకువద్దకు పరుగులు పెట్టారు. నగదు డ్రా చేసుకునేందుకు క్యూగట్టారు. ఆరు నెలలపాటటు న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ కార్యకలాపాలు నిలిపివేయాలని గురువారం రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటనతో ఆందోళన చెందారు. దీంతో డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఎగబడ్డారు. బాధిత కస్టమర్ల దృశ్యాలు ఆన్ లైన్ ప్రత్యక్షమయ్యాయి. 

బ్యాంకు బయట గుమికూడిన ఖాతాదారులు సేవింగ్స్ అకౌంట్ల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకు అధికారులను డిమాండ్ చేశారు. కూపన్ల పంపిణీ, లాకర్ల యాక్కెస్ కు బ్యాంకు అధికారులు వీలు కల్పించినప్పటికీ క్యాష్ విత్ డ్రాలపై పరిమితిని విధించారు. దీంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. 

ఆర్బీఐ ఆంక్షలు ఏంటీ.. 

RBI ముందస్తు అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వొద్దు,  పెట్టుబడుల స్వీకరణ, కొత్త డిపాజిట్లు నిషేధించబడింది. బ్యాంకులో ఆర్థిక ద్రవ్యస్థితిని దృష్టిలో ఉంచుకుని డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఈ చర్యలు విధించబడ్డాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.రుణాలు, అడ్వాన్సుల  మంజూరు, ఇన్వెస్ట్ మెంట్లు, నగదు విత్ డ్రాలు, కొత్త డిపాజిట్లు వంటివి ఏవీ చేయకూడదని తెలిపింది. 

గురువారం సాయంత్రం నుంచి ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సమీక్షకు లోబడి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయి. బ్యాంక్ ప్రస్తుత ద్రవ్యత స్థితిని దృష్టిలో ఉంచుకొని పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా లను అనుమతించవద్దని ఆర్బీఐ ఆదేశించింది. 

అయితే డిపాజిట్లపై రుణాలను ఆఫ్‌సెట్ చేయడానికి బ్యాంకుకు అనుమతిచ్చింది. ఇది ఉద్యోగుల జీతాలు, అద్దె ,విద్యుత్ బిల్లులు వంటి ముఖ్యమైన ఖర్చులకు కూడా నిధులను ఉపయోగించవచ్చు.దీంతోపాటు కొంతమంది డిపాజిటర్లకు బీమా క్లెయిమ్ లకు అనుమతినిచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి రూ. 5లక్సల వరకు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. 

బ్యాంకు ఖాతాదారులకు ఎటువంటి నష్టం ఉండదని రిజర్వ్ బ్యాంకు హామీ ఇస్తున్నప్పటికీ డిపాజిటర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది.