క్రికెట్ ఎంత ప్రమాదకర ఆట అనేది మరోసారి రుజువైంది. బాల్ తగిలి 52 ఏళ్ల జయేష్ సవాలా అనే వ్యక్తి సోమవారం మరణించాడు. మాతుంగాలోని దాడ్కర్ మైదాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని తలకు తాకడంతో ప్రాణాలను కోల్పోయాడు. లెజెండ్ కప్ T20 టోర్నమెంట్‌లో 50 ఏళ్లు పైబడిన వారి కోసం నిర్వహించబడుతున్న టోర్నీలో ఈ సంఘటన జరిగింది.
సవాలాను లయన్ తారాచంద్ ఆసుపత్రికి తరలించినప్పటికీ రక్షించలేకపోయారు. ఆసుపత్రిలోని మెడికల్ ఇన్‌చార్జ్.. 52 ఏళ్ల సవాలాను మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పలువురు ముంబై క్రికెటర్లు ఈ మైదానాల్లో ఆడారు.
క్రికెట్ లో బంతి తగిలి ఒక ఆటగాడు మరణించడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన షెఫీల్డ్ షీల్డ్ పోరులో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు బలంగా తగలడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ హ్యూస్ ప్రాణాలతో పోరాడి మరణించాడు.
A 52-year-old man in Mumbai passes away after suffering a head injury while fielding.#CricketTwitter #cricketnews #Cricket https://t.co/RdNWKIT2a4
— IndiaTVSports (@IndiaTVSports) January 10, 2024