IPL 2024: బుమ్రాతో కలిస్తే అంతే: ముంబై ఇడియన్స్ జట్టులో దక్షిణాఫ్రికా సంచలనం

క్వేనా మఫాకా.. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా ఒక్క స్టేట్ మెంట్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. "జస్ప్రీత్ బుమ్రా మీరు మంచి బౌలర్.. కానీ నేను మీ కంటే గొప్పవాడిని". సరిగ్గా రెండు నెలల క్రితం అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా 17 ఏళ్ళ కుర్రాడు క్వేనా మఫాకా ఇండియన్ స్టార్ బౌలర్ పై ఈ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనంగా మారాడు. తనపై తనకు నమ్మకముందని కొంతమంది చెబితే.. వార్తల్లో నిలవాలని ఇలా చెప్పుకొచ్చాడని మరికొందరు అన్నారు. అయితే తాజాగా ఈ దక్షిణాఫ్రికా 17 ఏళ్ళ పేసర్ మఫాకా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. 

శ్రీలంక పేసర్ మధుశంక గాయపడడంతో ఇతనికి రీప్లేస్ గా ముంబై యాజమాన్యం దక్షిణాఫ్రికా యువ బౌలర్ క్వేనా మఫాకాను ఎంపిక చేసింది. ఇటీవలే జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఈ సఫారీ బౌలర్ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు దడ పుట్టించాడు. ఈ క్రమంలో బుమ్రాకు ఛాలెంజ్ విసరగా.. చివరకు అతను ఆడుతున్న ముంబై జట్టుతోనే కలవడం విశేషం. ఇప్పటికే  ముంబై జట్టులో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కొయెట్జ్ తో పాటు శ్రీలంక పేసర్ నువాన్ తుషార రూపంలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఒకవేళ మఫాకాకు బుమ్రా తోడైతే ప్రత్యర్థులకు చుక్కలే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ :- IPL 2024: ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఏమైంది.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న మరో ఇంగ్లీష్ బౌలర్

అండర్ 19 ప్రపంచ కప్ లో భాగంగా మఫాకా వరుసగా మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. జనవరి 19 న వెస్టిండీస్ తో తొలి సారి 5 వికెట్లు తీసుకున్న ఈ యంగ్ పేసర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా జింబాబ్వే, శ్రీలంకపై 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ టోర్నీలో మొత్తం 21 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.   మార్చి 24న ఈ మ్యాచ్ జరుగుతుంది.