IPL 2025 Mega Auction: ముంబైకి కలిసొచ్చిన ఆక్షన్ రూల్.. స్టార్ ప్లేయర్లందరూ జట్టుతోనే

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. స్టార్ ఆటగాళ్లతో ఆ జట్టు ఎప్పుడూ పటిష్టంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషాన్ లాంటి అగ్ర శ్రేణి ఆటగాళ్లు కొన్నేళ్లుగా ముంబై జట్టులో కొనసాగుతున్నారు. ఈ సారి 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై ముంబై ఇండియన్స్ బిజీగా ఉంది. అయితే మెగాఆక్షన్ అయినా ముంబై ఇండియన్స్ తోనే ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఉండనున్నారు. 

2025 ఐపీఎల్ ఆక్షన్ రూల్ ముంబై ఇండియన్స్ కు బాగా కలిసొచ్చింది. అన్ని జట్లతో పోలిస్తే రిటైన్ రూల్ ముంబై శిబిరంలో ఆనందం కలిగిస్తుంది. మొదటి రిటైన్ ప్లేయర్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్య.. రెండో రిటైన్ ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్.. మూడో రిటైన్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ తీసుకోనుంది. నాలుగో రిటైన్ ప్లేయర్ గా రోహిత్ శర్మను ఐదో రిటైన్ ఆటగాడిగా బుమ్రాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ALSO READ | Women's T20 World Cup 2024: కంగారులను కొట్టాల్సిందే: భారత్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?

రిటైన్ రూల్స్ ప్రకారం తొలి రిటైన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగు ఐదు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం స్టార్ ఆటగాళ్లను ముంబై వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు.

మొత్తం 120 కోట్ల పర్స్ లో రూ. 75 కోట్లు ఈ స్టార్ ఆటగాళ్లకు కేటాయించడం దాదాపుగా ఖాయం. మిగిలిన రూ. 45 కోట్లతో ఎవరిని టార్గెట్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది. RTM కార్డు ద్వారా టిమ్ డేవిడ్, నెహ్యాల్ వధేరా, ఆకాష్ మద్వల్ ను తీసుకునే అవకాశం ఉంది.