
ఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-17లో మరోసారి స్లో ఓవర్ రేట్ జరిమానా ఎదుర్కొన్నాడు. మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత టైమ్‌లో ఓవర్ల కోటాను పూర్తిచేయకపోవడంతో రిఫరీ అతనిపై జరిమానా విధించాడు. రెండోసారి ఇలాంటి తప్పిదం చేయడంతో పాండ్యా కు రూ. 24 లక్షలు, ముంబై టీమ్ మెంబర్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించినట్టు ప్రకటించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ హార్దిక్ జరిమానాకు గురయ్యాడు.