
విమెన్స్ ప్రీమియ్ లీగ్ ముగింపు దశకు వచ్చింది. మరో గ్రూప్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా ఫైనల్ బెర్త్ పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జయింట్స్ నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మంగళవారం (మార్చి 11) జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ తో గ్రూప్ దశ ముగిస్తుంది. నేడు జరగనున్న మ్యాచ్ లో ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకంగా మారింది.
బెంగళూరుపై నేడు జరగనున్న మ్యాచ్ లో గెలిస్తే ముంబైగా నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ముంబై ఓడిపోతే నెట్ రన్ రేట్ తేడాతో ఢిల్లీ ఫైనల్ కు దూసుకెళ్తుంది. ముంబై ఇప్పటివరకు 7 మ్యాచ్ లో 5 విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 విజయాలతో టాప్ లో ఉంది. నెట్ రన్ రేట్ ముంబై కంటే ఎక్కువ ఉండడం ఢిల్లీకి కలిసొచ్చింది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 4 విజయాలు, 4 ఓటములు.. 8 పాయింట్లతో మూడో స్థానంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది.
ALSO READ | NZ vs PAK: కివీస్ క్రికెటర్లకు నో రెస్ట్.. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
సోమవారం (మార్చి 10) గుజరాత్ పై ముంబై ఇండియన్స్ జట్టు ఐదో విజయం అందుకుంది. టాప్ ప్లేస్‌తో నేరుగా ఫైనల్ చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బాల్స్‌లో 9 ఫోర్లతో 54) ఫిఫ్టీకి తోడు బౌలర్లు సత్తా చాటడంతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 రన్స్ తేడాతో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 170/9 స్కోరు చేసి ఓడింది.