చెపాక్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (11), ఇషాన్ కిషన్ (15) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కామెరూన్ గ్రీన్(41), సూర్యకుమార్ యాదవ్ (33) మరో వికెట్ పడకుండా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును పెంచారు.
ఇక తిలక్ వర్మ (33) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో నేహల్ వధేరా(23) పరుగులతో చేలరేగాడు. దీంతో ముంబై 182 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో బౌలర్లలో నవీనుల్ హక్ 4, యశ్ ఠాకూర్ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. మోసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.