MI vs KKR: ముంబై బౌలర్ల విశ్వరూపం.. 116 పరుగులకే ఆలౌటైన కోల్‌కతా

MI vs KKR: ముంబై బౌలర్ల విశ్వరూపం.. 116 పరుగులకే ఆలౌటైన కోల్‌కతా

ఐపీఎల్ సీజన్ 18 లో ముంబై ఇండియన్స్ తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై బౌలింగ్ లో విశ్వరూపం చూపిస్తూ విజయం దిశగా అడుగులేస్తోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ని కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేసింది. 23 ఏళ్ళ యువ బౌలర్ అశ్వని కుమార్ విజృంభణకు తోడు మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించారు. 26 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ కేకేఆర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో బంతికే నరైన్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. రెండో ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి ఓపెనర్ క్వింటన్ ఒక పరుగుకే పెవిలియన్ కు చేరాడు. కెప్టెన్ రహానే కూడా కాసేపటికే 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ (3) అనవసర షాట్ కు ప్రయత్నించి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో యంగ్ బ్యాటర్స్ అంగ్‏క్రిష్  ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రఘువంశీ (26).. వేగంగా ఆడే క్రమంలో హార్ధిక్ పాండ్యా బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు.  

ALSO READ | MI vs KKR: పీకల్లోతూ కష్టాల్లో KKR.. ముంబై బౌలర్ల ధాటికి కుప్పకూలిన టాపార్డర్

దీంతో కేకేఆర్ 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడకున్న రింకూ సింగ్ 17 పరుగులు చేసి ఔట్ కాగా.. వెంటనే  మనీష్ పాండే(19), రస్సెల్ (5) పెవిలియన్ కు క్యూ కట్టారు. చివర్లో రమణ్ దీప్ (22) కాస్త మెరుపులు మెరిపించడంతో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బోల్ట్, సాంట్నర్, విగ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.