SRH vs MI: హైదరాబాద్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై

హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ లో తొలి మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ తో  సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో తలపడుతుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న మొదలైన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు తమ తొలి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయి వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఓడిపోతే.. కోల్ కతా చేతిలో సన్ రైజర్స్ గెలుపు అంచుల వరకు వచ్చి ఓడింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఒక్క మార్పు చేసింది. ల్యూక్ వుడ్ స్థానంలో సౌతాఫ్రికా యువ సంచలనం మఫాకా వచ్చాడు.    మరోవైపు సన్ రైజర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.   మార్కో జాన్సెన్ స్థానంలో హెడ్, నటరాజన్ స్థానంలో ఉనాద్కట్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు.   

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా