
ఐపీఎల్ 2025లో ఆదివారం (ఏప్రిల్ 20) మరో బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ముంబై ఆడిన 7 మ్యాచ్ ల్లో మూడు గెలిచింది. మరోవైపు చెన్నై ఆడిన 7 మ్యాచ్ ల్లో 2 విజయాలు సాధించింది. ఓడిపోయిన జట్టు ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంటుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే చెన్నై ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. త్రిపాఠి స్థానంలో ఆయుష్ మాత్రే జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, MS ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ