
ఐపీఎల్ లో మరో సూపర్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు లీగ్ లో తొలి మ్యాచ్ లో తలపడనున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లకు కొత్త కెప్టెన్ పరిచయం కానున్నారు. గిల్ సారధ్యంలో గుజరాత్ బరిలోకి దిగుతుంటే.. ముంబైను హార్దిక్ పాండ్య లీడ్ చేయనున్నాడు. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో తొలి మ్యాచ్ లో ఎవరు గెలిచి బోణీ చేస్తారో చూడాలి.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్
Mumbai Indians captain Hardik Pandya won the toss and elected to bowl first
— CricTracker (@Cricketracker) March 24, 2024
📸: Jio Cinema pic.twitter.com/Nq4CnDU2XO