MI vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. మూడు మార్పులతో హార్దిక్ సేన

MI vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. మూడు మార్పులతో హార్దిక్ సేన

ఐపీఎల్ లో సోమవారం (మార్చి 31) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ప్రారంభమైంది. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన హార్దిక్ సేన సొంతగడ్డపై ఎలాగైనా విజయం సాధించాలని కోరుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పై ఇచ్చిన గెలుపుతో కేకేఆర్ తమ విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగించాలనుకుంటుంది. 

ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మొయిన్ అలీ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు దూరమైన సునీల్ నరైన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఏకంగా మార్పులతో బరిలోకి దిగుతుంది. విల్ జాక్స్, విగ్నేష్ పుతూర్, అశ్వని కుమార్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించారు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): 

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్