
ఐపీఎల్ లో సోమవారం (ఏప్రిల్ 7) బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలబడనుంది. వాంఖడే వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ 11 లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఆర్సీబీ బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ముంబై ఒక మ్యాచ్ లో గెలిచి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మరోవైపు ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచి ఒకటి ఓడిపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్