MI vs SRH: ముంబైతో కీలక పోరు.. టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్

MI vs SRH: ముంబైతో కీలక పోరు.. టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్

ఐపీఎల్ 2025 లో గురువారం (ఏప్రిల్ 17) బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడతుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం కారణంగా బౌలింగ్ తీసుకుంటున్నట్టు ముంబై కెప్టెన్ పాండ్య చెప్పాడు. బుమ్రా గురించి ఎలాంటి ఆందోళన లేదని.. ప్లేయింగ్ లో ఎలాంటి మార్పులు లేవని హార్దిక్ అన్నాడు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.       

టోర్నీలో రెండు జట్లు కూడా ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించాయి ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం.  

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
 
ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ   

►ALSO READ | DC vs RR: సూపర్ ఓవర్‌లో అతడిని పంపకపోవడం మాకు కలిసొచ్చింది: అక్షర్ పటేల్