
ఐపీఎల్ లో మరో ఆసక్తికర సమరమ మొదలయింది. గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిషేధం కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన హార్దిక్ పాండ్య జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇరు జట్లకు టోర్నీలో ఇది రెండో మ్యాచ్. రెండు జట్లు కూడా తొలి మ్యాచ్ లో ఓడిపోయాయి. దీంతో ఏ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు