IPL 2024: బెంగళూరు బాటలోనే ముంబై.. ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్టేనా..?

IPL 2024: బెంగళూరు బాటలోనే ముంబై.. ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్టేనా..?

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ లో ఓడింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే కీలకమైన మ్యాచ్ లో ఓటమిపాలైంది. నిన్న (ఏప్రిల్ 22) జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినా చిత్తుగా ఓడింది. దీంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా..? ఇంకెన్ని మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుందో ఇప్పుడు చూద్దాం.
 
ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆట తీరు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు కనీస ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం మూడు మ్యాచ్ ల్లోనే గెలిచిన్చది. టోర్నీ ప్రారంభంలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన హార్దిక్ సేన తర్వాత క్రమంగా పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ కు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పింది. అయితే మళ్ళీ గాడి తప్పింది చివరి మూడు మ్యాచ్ ల్లో రెండు సార్లు ఓడిపోయింది. 

టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ లు చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ముంబై 8 మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించింది. నిన్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోవడంతో మిగిలిన 6 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు తప్పకుండా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఐపీఎల్ లో అన్ని బలమైన జట్లే. ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలంటే శక్తికి మించిన పని. దీంతో ముంబై ప్లే ఆఫ్ కు చేరాలంటే శక్తికి మించి శ్రమించాల్సిందే. 

టాస్‌‌‌‌ నెగ్గిన ముంబై తొలుత 20 ఓవర్లలో 179/9 స్కోరు చేసింది. తిలక్‌‌‌‌ వర్మ (45 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 65), నేహల్‌‌‌‌ వాధెరా (24 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 49) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు.తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన రాజస్తాన్‌‌‌‌ 18.4 ఓవర్లలోనే 183/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. యశస్వి జైస్వాల్‌‌‌‌ (60 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌లతో 104 నాటౌట్‌‌‌‌) సెంచరీతో దుమ్మురేపడంతో..  9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌పై నెగ్గింది.