ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ తమ ప్రస్థానాన్ని ముగించింది. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఆడిన 12 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ లే గెలిచిన ముంబై.. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగింది.
5 సార్లు ఛాంపియన్.. జట్టు నిండా అంతర్జాతీయ స్టార్స్ అయినా ముంబై దారుణ ప్రదర్శన చేసింది. గతేడాది ప్లే ఆఫ్ కు వెళ్లినా ఈ సారి మాత్రం ముందుగానే ఇంటికి వెళ్ళింది. దీనికి కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్య అని ముంబై ఫ్యాన్స్ తో పాటు సహచర ఆటగాళ్లు అంటున్నారు.
నివేదికల ప్రకారం పాండ్య కెప్టెన్సీపై కొంతమంది ప్లేయర్లు అసంతృప్తిగా ఉన్నారట. రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ కోచింగ్ ప్యానెల్‌కు తెలియజేసారని వార్తలొస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరం గందరగోళంగా ఉన్నట్లు సమాచారం.
ఇక తిలక్ వర్మ విషయంలో హార్దిక్ తీరు ఎవరికీ నచ్చలేదు. ఈ మ్యాచ్ లో ముంబై 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేసినా.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వేగంగా పరుగులు చేయాల్సిందని పాండ్య అన్నాడు. దీంతో పాండ్యపై విమర్శలు ఎక్కువయ్యాయి.
2022,2023 లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించాడు. అంచనాలు లేకుండా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ టైటిల్ అందించాడు. 2023లో గుజరాత్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. మరోవైపు రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీపై ఆసక్తి లేదని చెప్పడంతో ముంబై ఫ్రాంచైజీ కన్ను హార్దిక్ మీద పడింది. దీంతో అనుకున్నట్లుగానే భారీ మొత్తం వెచ్చించి ట్రేడింగ్ ద్వారా గుజరాత్ నుంచి ముంబైకు తీసుకొని రావడంలో సఫలమయ్యారు.
Mumbai Indians' key players recently conveyed to the coaching staff that there was a lack of buzz in the dressing room and the reason was Hardik Pandya's leadership style. (Devendra Pandey from Indian Express). pic.twitter.com/XSm2JM5tFF
— Tanuj Singh (@ImTanujSingh) May 9, 2024