GT vs MI: అదరగొట్టిన గుజరాత్ టాపార్డర్.. ముంబై ముందు భారీ టార్గెట్!

GT vs MI: అదరగొట్టిన గుజరాత్ టాపార్డర్.. ముంబై ముందు భారీ టార్గెట్!

ఐపీఎల్ లో మరో హై స్కోరింగ్ గేమ్ అభిమానులని అలరించనుంది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63 పరుగులు: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గిల్(38), బట్లర్ (39) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య 2 వికెట్లు తీసుకున్నాడు. బోల్ట్, చాహర్, ముజీబ్, సత్యనారాయణ తలో వికెట్ పడగొట్టారు.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఓపెనర్లు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 78 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఇద్దరూ బ్యాట్ ఝుళిపించడంతో పవర్ ప్లే లో గుజరాత్ 66 పరుగులు రాబట్టింది. 38 పరుగులు చేసిన గిల్ భారీ షాట్ కొట్టబోయి మిడ్ వికెట్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో బట్లర్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. 

రెండో వికెట్ కు 51 పరుగులు జోడించిన తర్వాత బట్లర్ (39) ను ముజీబ్ ఒక మంచి బంతితో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత  వెంటనే ఒక సిక్సర్ కొట్టి షారుఖ్ ఖాన్ (9) పెవిలియన్ కు చేరాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును ముందింది నడిపించాడు. ఒకదశలో 200 పరుగులు ఖాయమనుకుంటే చివర్లో వరుసగా గుజరాత్ వికెట్లను కోల్పోయింది. స్వల్ప వ్యవధిలో సాయి సుదర్శన్ (63), రాహుల్ తేవాటియా (0), రూథర్ ఫోర్డ్ (180 ఔటయ్యారు.