ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 11) హై వోల్టేజ్ కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆర్సీబీ ఐదు మ్యాచ్ లాడితే ఒకే మ్యాచ్ లో గెలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ ల్లో ఒకటే గెలిచింది. ఈ మ్యాచ్ లో మార్పులేమీ లేకుండానే ముంబై బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గ్రీన్ స్థానంలో విల్ జాక్స్ ప్లేయింగ్ 11లో చేరాడు. ఆకాష్ దీప్, వైశుక్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లొమ్రోర్, రీస్ టోప్లీ, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్
#IPL2024 #MIvRCB | Match 25
— TOI Sports (@toisports) April 11, 2024
TOSS: Mumbai Indians skipper Hardik Pandya wins toss, opts to bowl against Royal Challengers Bengaluru
Follow Live: https://t.co/CFASSXWM5x pic.twitter.com/0rpeyEufpk