
వాంఖడే వేదికగా లక్నో సూపర్ జయింట్స్ జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో దుమ్ము లేపింది. ఆదివారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రికెల్ టన్ (32 బంతుల్లో 58: 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 54:4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో లక్నో ముందు 216 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు రికెల్ టన్, రోహిత్ శర్మ ప్రారంభం నుంచి మెరుపులు మెరిపించడంతో స్కోర్ శరవేగంగా ముందు కదిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి మంచి ఊపు మీదున్న హిట్ మ్యాన్ ఆ తర్వాత బంతికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ముంబై తమ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ ఔటైన తర్వాత రికెల్ టన్ చెలరేగాడు. ఆరో ఓవర్ లో రెండు సిక్సర్లతో 19 పరుగులు రావడంతో ముంబై పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.
►ALSO READ | DC vs RCB: ఢిల్లీతో ప్రతీకార పోరు.. సొంతగడ్డపై ఆల్ టైమ్ రికార్డ్‌పై కోహ్లీ గురి
25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రికెల్ టన్ పవర్ ప్లే తర్వాత 58 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యతో స్వల్ప భాగస్వామ్యం తర్వాత 21 బంతుల్లో 29 పరుగులు చేసి విల్ జాక్స్ ఔటయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మ ఔటైనా సూర్య కుమార్ యాదవ్ మాత్రం లక్నోకి చుక్కలు చూపించాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకొని ఆ తర్వాత బంతికే పెవిలియన్ కు చేరాడు. చివర్లో నమన్ ధీర్ (25), కార్బిన్ బాష్ (20) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోర్ 200 పరుగుల మార్క్ దాటింది.
A six off the final ball takes MI past 210 📈#MIvLSG LIVE: https://t.co/RhpVPVsTuU pic.twitter.com/WJtH2DWmq3
— ESPNcricinfo (@ESPNcricinfo) April 27, 2025