ముంబై: వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో లేటుగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతనికి ఎన్‌సీఏ ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదు. గత డిసెంబర్‌లో గాయపడ్డ సూర్య టీమిండియాకు దూరమై ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. మంగళవారం ఎన్‌సీఏలో సూర్యకు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించినట్టు తెలుస్తోంది.
కానీ, మరోసారి పరీక్ష చేసిన తర్వాతనే ఫిట్‌నెస్‌పై నిర్ధారణకు వస్తామని ఎన్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న గుజరాత్‌తో తొలి మ్యాచ్‌తో పాటు ముంబై తదుపరి మూడు మ్యాచ్‌లకు కూడా సూర్య దూరమయ్యే చాన్సుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేయడం దీనికి బలం చేకూరుస్తోంది.