ముంబైని ఆపతరమా! ఐదో టైటిల్‌‌పై రోహిత్‌ సేన దృష్టి..

అత్యంత బలమైన జట్లలో ఒకటి

ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం… ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ స్టయిల్‌‌ ఇది. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ అంతే. ఫస్ట్‌‌ ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌‌ వరకూ వచ్చిన ఆ జట్టు తర్వాతి ఏడు సీజన్లలో ఏకంగా నాలుగు టైటిల్స్‌‌ నెగ్గింది.  ఈ నాలుగు టైటిల్స్‌‌ రోహిత్‌‌ శర్మ కెప్టెన్సీలోనే రావడం విశేషం. లెజెండ్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ తర్వాత అంతటి కూల్‌‌గా ఉండే కెప్టెన్‌‌గా పేరు తెచ్చుకున్న హిట్‌‌మ్యాన్‌‌  బ్యాటింగ్‌‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లాస్ట్‌‌ సీజన్‌‌లో ముంబై ఫైనల్లో చెన్నైని ఓడించి రికార్డు స్థాయిలో నాలుగోసారి విజేతగా నిలిచింది. ఈ సారి కూడా అదే జోరు కొనసాగిస్తే ముంబైకి ఎదురుండదు. అయితే, స్ట్రాంగ్‌‌ టీమ్‌‌, స్ట్రాంగ్‌‌ కెప్టెన్‌‌,  బెస్ట్ సపోర్ట్‌‌ స్టాఫ్‌‌ ఉన్నప్పటికీ ముంబై ఒక్కసారి కూడా టైటిల్‌‌ను డిఫెండ్‌‌ చేసుకోలేదు. నాలుగు టైటిల్స్‌‌నూ ఆల్టర్నేట్‌‌ ఇయర్స్‌‌లోనే నెగ్గిందా జట్టు. ఈసారి  వేదిక మారింది. వాతావరణం మారింది. మరి, ఆ జట్టు టైటిల్​ను​ డిఫెండ్‌‌ చేసుకుంటుందా?

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: ఐపీఎల్​లో ముంబై టాపార్డర్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఈ సారి క్రిస్‌‌ లిన్‌‌ రాకతో మరింత స్ట్రాంగ్‌‌గా మారింది. కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ ఓపెనర్​గా దుమ్మురేపిన లిన్‌‌ ఈ సారి సౌతాఫ్రికా వికెట్‌‌ కీపర్​ క్వింటన్‌‌ డికాక్‌‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌‌ ఆరంభించే చాన్సుంది. అప్పుడు మరో వరల్డ్‌‌ బెస్ట్‌‌ ఓపెనర్​ రోహిత్‌‌  వన్‌‌డౌన్‌‌లో రావొచ్చు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు నిలిచినా అవతలి టీమ్‌‌ బౌలర్లకు మూడినట్టే. రోహిత్‌‌ కూల్‌‌ కెప్టెన్సీ టీమ్‌‌కు అదనపు బలం. హై ప్రెజర్​లోనూ అతను ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలడు. వరల్డ్‌‌ బెస్ట్‌‌ టీ20 బౌలర్లలో ఒకడైన బుమ్రా, వరల్డ్‌‌ క్లాస్‌‌ ఆల్‌‌రౌండర్లైన హార్దిక్ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌ అండ ముంబై సొంతం. సూర్యకుమార్​, ఇషాన్‌‌ కిషన్‌‌ రూపంలో ఇండియన్‌‌ యంగ్‌‌స్టర్స్‌‌ సపోర్ట్‌‌ కూడా ఉంది.  అలాగే హెడ్‌‌ కోచ్‌‌ జయవర్ధనే, మెంటార్​ సచిన్‌‌​, క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌ డైరెక్టర్​ జహీర్​ ఖాన్, బౌలింగ్‌‌ కోచ్‌‌ షేన్‌‌ బాండ్‌‌ తదితరుల గైడెన్స్‌‌ గేమ్‌‌ప్లాన్‌‌ విషయంలో రోహిత్‌‌కు ఉపయోగపడనుంది.

వీక్‌‌నెస్‌‌

ఈ సీజన్‌‌ ఇండియాలో జరిగి ఉంటే ముంబై బౌలింగ్‌‌ అటాక్‌‌ అత్యంత పదునుగా ఉండేది. టోర్నీ యూఏఈలో జరుగుతుంది కాబట్టి అక్కడి పిచ్‌‌లకు తగ్గట్టు క్వాలిటీ స్పిన్నర్లు ముంబైలో లేరు. రాహుల్‌‌ చహర్​, క్రునాల్‌‌ పాండ్యా మాత్రమే ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఫిట్‌‌ అయ్యేలా ఉన్నారు. కానీ, వీరిని వికెట్‌‌ టేకింగ్‌‌ బౌలర్లకంటే రన్‌‌ సేవింగ్‌‌ స్పిన్నర్లు అనొచ్చు. పైగా బుమ్రా మినహాయిస్తే ముంబై పేస్‌‌ లైనప్‌‌ స్ట్రాంగ్‌‌గా లేదు.  లసిత్ మలింగ లేకపోవడం  పెద్ద లోటు. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ నుంచి ట్రేడింగ్‌‌ ద్వారా తీసుకున్న కివీస్‌‌ స్పీడ్‌‌స్టర్​ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ను నమ్ముకోలేం. ఎందుకంటే ఐపీఎల్‌‌లో అతని ఎకానమీ రేట్‌‌ 8.75. లాస్ట్‌‌ సీజన్లో అతను ఐదే మ్యాచ్‌‌లు ఆడాడు. కొత్తగా వచ్చిన నేథన్‌‌ కూల్టర్​నైల్‌‌ గత రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్‌‌ కూడా ఆడలేదు. మరో పేసర్  మెక్లెనగన్‌‌లో నిలకడ లేదు. మలింగ ప్లేస్‌‌లో వచ్చిన ఆసీస్‌‌ పేసర్ జేమ్స్‌‌ ప్యాటిన్సన్‌‌ ఈ ఫార్మాట్‌‌లో తనను తాను నిరూపించుకోలేదు. ఇండియన్‌‌ పేసర్​ ధవల్‌‌ కులకర్ణి కూడా ఏమంత ఆకట్టుకోవడం లేదు. రాజస్తాన్‌‌ రాయల్స్‌‌కు ఆడిన ధవల్‌‌ గత మూడు సీజన్లలో 13 వికెట్లే తీశాడు. దాంతో భారమంతా బుమ్రాపైనే ఉంటుంది. ఇక, యూఏఈలో ముంబై రికార్డు పేలవంగా ఉంది. 2014లో ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లోనూ ఓడిపోయింది.

అంచనా

ఎప్పట్లాగే ముంబైపై భారీ అంచనాలున్నాయి. పేపర్​పై చాలా స్ట్రాంగ్‌‌గా ఉందా టీమ్‌‌.  నాలుగు టైటిళ్లు నెగ్గడం, ఐదు ఫైనల్స్‌‌ ఆడిన అనుభవం ఉంది కాబట్టి కీలక మ్యాచ్‌‌ల్లో సత్తా చాటగలదు. బౌలింగ్‌‌  కాస్త వీక్‌‌గా ఉన్నా ఈ సారి కూడా ప్లే ఆఫ్స్‌‌కు చేరుకోగల సామర్థ్యం ఉంది.

ముంబై టీమ్‌‌

బ్యాట్స్‌‌మెన్‌‌: రోహిత్‌‌ శర్మ (కెప్టెన్‌‌),  క్రిస్‌‌ లిన్‌‌, సూర్యకుమార్​యాదవ్‌‌, అన్మోల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, సౌరభ్‌‌ తివారీ, మోసిన్‌‌ ఖాన్‌‌, షెర్ఫానే రూథర్​ఫర్డ్‌‌,

వికెట్‌‌ కీపర్స్‌‌: క్వింటన్‌‌ డికాక్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, ఆదిత్య తారె

ఆల్‌‌రౌండర్స్‌‌: హార్దిక్‌‌ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌, క్రునాల్‌‌ పాండ్యా,  అనుకూల్ రాయ్‌‌, ప్రిన్స్‌‌ బల్వంత్‌‌ రాయ్‌‌ సింగ్‌‌

బౌలర్స్‌‌: జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, ధవళ్‌‌ కులకర్ణి, మిచెల్‌‌ మెక్లెనగన్‌‌,  ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, రాహుల్‌‌ చహర్, దిగ్విజయ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌, జేమ్స్‌‌ ప్యాటిన్సన్‌‌, జయంత్‌‌ యాదవ్‌‌, నేథన్‌‌ కూల్టర్​నైల్.

For More News..

బ్యాడ్మింటన్‌ క్యాంప్‌ రద్దు

లంచం కోసం పక్కా స్కెచ్