తిలక్ వర్మ ఇంట్లో ముంబై ఇండియన్స్ సందడి

 తిలక్ వర్మ ఇంట్లో ముంబై ఇండియన్స్ సందడి

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో మ్యాచ్ ఆడేందుకు భాగ్యనగరానికి వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేసింది. సచిన్, రోహిత్ శర్మ, పియుష్ చావ్లా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అర్జున్ టెండూల్కర్ సహా ముంబై ఆటగాళ్లు తిలక్ వర్మ ఇంటికి వెళ్లారు. తిలక్ వర్మ ఆహ్వానం మేరకు అతని ఇంట్లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి ముంబై ఆటగాళ్లు ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

సచిన్ సహా ముంబై ఇండియన్స్ టీమ్ తన ఇంటికి రావడంపై తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. నా ఎంఐ పల్టన్‌ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్‌ పార్టీ... ఈ అద్భుతమైన రోజును,  నేను, నా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం... మా ఇంటికి వచ్చిన ఎంఐకు ధన్యవాదాలు... అంటూ కృతజ్ఞతలు తెలిపాడు 

2022లో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. 14 ఇన్నింగ్స్‌లో 397 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు 4 మ్యాచులు ఆడి177 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్‌.