అమన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్ షో

అమన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్ షో
  • ఆర్‌‌‌‌‌‌‌‌సీబీపై ముంబై ఉత్కంఠ విజయం

బెంగళూరు: అమన్‌‌‌‌జోత్ కౌర్  (27 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్‌‌‌‌; 3/22) ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఆకట్టుకోవడంతో విమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌)లో ముంబై ఇండియన్స్‌‌‌‌ రెండో విజయం సాధించింది. శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌‌‌లో  4 వికెట్ల తేడాతో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ)ను ఓడించింది. తొలుత  ఎలైస్ పెర్రీ (43 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81) మెరుపులతో  ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. రిచా ఘోశ్ (28), కెప్టెన్ స్మృతి మంధాన (26) కూడా రాణించారు.

డానీ వ్యాట్‌‌‌‌ (9), రాఘవి బిస్త్ (1), కనిక (3) నిరాశపరిచారు. ముంబై బౌలర్లలో అమన్‌‌‌‌జోత్ మూడు వికెట్లు పడగొట్టింది. ఛేజింగ్‌‌‌‌లో ముంబై  19.5  ఓవర్లలో 170/6  స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ (38 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 50), సివర్ బ్రంట్‌‌‌‌ (21 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లతో 42) సత్తా చాటగా.. చివర్లో అమన్ మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో ముంబైని గెలిపించి  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచింది. శనివారం జరిగే మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌, యూపీ వారియర్స్ జట్లు పోటీ పడతాయి.