
ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ మరో ఘోర పరాజయాన్ని చవి చూసింది. బుధవారం (ఏప్రిల్ 23) ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై సన్ రైజర్స్ ను చావు దెబ్బ కొట్టి భారీ విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (46 బంతుల్లో 70:8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలిచింది.
144 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే ఓపెనర్ రికెల్ టన్ (11) వికెట్ కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ పోటీ పడడంతో పవర్ ప్లే లో ముంబై 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. రెండో వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత జాక్స్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ లకు వచ్చిన సూర్యతో కలిసి రోహిత్ మ్యాచ్ ను విజయం దగ్గరకు తెచ్చాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 71 పరుగులు చేసి ఔటయ్యాడు.
Also Read : అర్ధం లేని క్రీడా స్ఫూర్తి.. ఔట్ కాకుండానే వెళ్లిపోయిన కిషాన్
మరో ఎండ్ లో సూర్య 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్, సూర్య మూడో వికెట్ కు 53 పరుగులు జోడించారు. సన్ రైజర్స్ బౌలర్లలో జీషన్ అన్సారీ, ఉనాద్కట్, మలింగ తలో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు సన్ రైజర్స్ 8 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ లు ఓడిపోయి దాదాపు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడంతో సన్ రైజర్స్ మిగిలిన ఆరు మ్యాచ్ ల్లో భారీగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంటుంది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైనా.. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోశాడు. క్లాసన్ హాఫ్ సెంచరీతో పాటు అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 71 పరుగులు చేసి క్లాసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బోల్ట్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ రెండు.. బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.
Comfortable chase by MI as they move up to third on the points table 📈
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2025
Scorecard: https://t.co/Sn6VwVOiKs | #IPL2025 #SRHvMI pic.twitter.com/rTk8G4i950