
ఐపీఎల్ 2025 లో వరుస విజయాలతో ఢీలా పడిన ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టింది. మొదట ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచిన ముంబై.. ఢిల్లీ, సన్ రైజర్స్ పై వరుస విజయాలను సాధించింది. వాంఖడే వేదికగా ఆదివారం (ఏప్రిల్ 20) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది.
భారీ ఛేజింగ్ లో స్టార్ బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 68: 6 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ(45 బంతుల్లో 76: 6 సిక్సర్లు, 4 ఫోర్లు) చెలరేగడంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది.
177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి సూపర్ స్టార్ట్ లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్ టన్ మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో 24 పరుగులు చేసిన రికెల్ టన్ ఔట్ కావడంతో ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో రోహిత్ కు జత కలిసిన సూర్య అదే పనిగా రెచ్చిపోయాడు. మరో ఎండ్ లో హిట్ మ్యాన్ హిట్టింగ్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోని వచ్చింది. చెన్నై బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీల వరద పారించారు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ 12 ఓవర్లో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో సూర్య 26 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. చివర్లో వీరు మరింతగా చెలరేగడంతో మ్యాచ్ 16 ఓవర్లు ముందుగానే ముగిసింది. పతిరానా వేసిన 16 ఓవర్ మూడు, నాలుగు బంతులకు వరుస సిక్సర్లు కొట్టి సూర్య మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. సూర్య, రోహిత్ రెండో వికెట్ కు అజేయంగా 54 బంతుల్లోనే 114 పరుగులు జోడించడం విశేషం. చెన్నై బౌలర్లలో జడేజాకు ఏకైక వికెట్ దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో రాణించింది. స్టార్ ప్లేయర్లు జడేజా(35 బంతుల్లో 53:4 ఫోర్లు, 2 సిక్సర్లు), దూబే(32 బంతుల్లో 50:2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేయడంతో ముంబై ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 53 పరుగులు చేసిన జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు.. సాంట్నర్, అశ్వని కుమార్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.
WOW, MI completely dominate CSK and send a statement to the rest of the league 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) April 20, 2025
🔗 https://t.co/cUeTpsth1l | #IPL2025 pic.twitter.com/N9sFb4xdc4