LSG vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ శర్మ స్థానంలో 22 ఏళ్ళ ఆల్ రౌండర్!

LSG vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ శర్మ స్థానంలో 22 ఏళ్ళ ఆల్ రౌండర్!

ఐపీఎల్ లో శుక్రవారం (ఏప్రిల్ 4) లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది టోర్నీలో నాలుగో మ్యాచ్. రెండు జట్లు కూడా ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడిపోయి ఒక మ్యాచ్ లో గెలిచాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు 3 పరాజయాలతో టోర్నీలో ప్లే ఆఫ్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. 

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ లేకుండానే ముంబై బరిలోకి దిగుతుంది. హిట్ మ్యాన్ స్థానంలో 22 ఏళ్ళ ఆల్ రౌండర్ రాజ్ భవా తుది జట్టులో స్థానం సంపాదించాడు. మరోవైపు లక్నో జట్టులో ఆకాష్ దీప్ గాయం నుంచి కోలుకొని ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు.      

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్, ట్రెంట్ బౌల్ట్       
 

  

►ALSO READ | IPL 2025: ఒకే జట్టుకు ఆడుతూ 200 వికెట్లు.. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ అరుదైన ఘనత!