SRH vs MI: ముంబైతో ఉప్పల్‌లో మ్యాచ్.. సన్ రైజర్స్ బ్యాటింగ్.. తుది జట్టు నుంచి షమీ ఔట్

SRH vs MI: ముంబైతో ఉప్పల్‌లో మ్యాచ్..   సన్ రైజర్స్ బ్యాటింగ్.. తుది జట్టు నుంచి షమీ ఔట్

ఐపీఎల్ లో ఉప్పల్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 23) సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇప్పటివరకు సన్ రైజర్స్ ఆడిన 7 మ్యాచ్ ల్లో 2 గెలిచింది. నేడు జరగనున్న మ్యాచ్ లో ఓడిపోతే హైదరాబాద్ జట్టుకు ఇక ప్రతి మ్యాచ్ చావో రావో. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ అసలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది.

మరోవైపు ముంబై ఆడిన 8 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించింది. తొలి 5 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచిన హార్దిక్ సేన ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటింది. సన్ రైజర్స్ పై గెలిచి విజయాల పరంపర కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముంబై అశ్వని స్థానంలో విగ్నేష్ పుతూర్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకొచ్చింది.  సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో షమీ స్థానంలో ఉనాద్కట్ ను జట్టులోకి తెచ్చింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్