ముంబై: ముంబైలో 90 అడుగుల ఇనుప వంతెన మాయమైంది. డ్రైన్‌పై నిర్మించిన 6 వేల కిలోల ఇనుప వంతెన చోరీకి గురైందని అధికారులు శనివారం తెలిపారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాగా, మలాడ్‌లో నిర్మిస్తున్న మెటల్కట్టడంకోసం భారీ పవర్ కేబుల్స్ తరలించడానికి ఈ ఇనుప వంతెనను తాత్కాలికంగా నిర్మించారు. ఆపై పర్మనెంట్ బ్రిడ్జి నిర్మించి తాత్కాలిక వంతెనను మరో ప్రాంతానికి తరలించారు. కొన్నినెలల క్రితం ఈ ఘటన జరిగింది. జూన్ 26న బ్రిడ్జి మాయమైనట్లు కనస్ట్రక్షన్ కంపెనీ గుర్తించింది. దీనిపై ఫిర్యాదుచేయడంతో పోలీసు లు దర్యాప్తు ప్రారంభించారు.
జూన్ 6న ఇనుప వంతెనను చివరిసారి చూసినట్లు దర్యాప్తులో పోలీసులకు కొంతమంది వెల్లడించారు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జూన్ 11న భారీ వాహనం ఒకటి వంతెన దిశగా వెళ్లినట్లు గుర్తించారు. బ నంబర్ సాయంతో వాహన వివారాలను పోలీసులు కనుగొన్నారు. గ్యాస్ కట్టింగ్ మెషిన్లను ఉపయోగించి 90 అడుగుల వంతెనను కట్ చేశారని దర్యాప్తులో తేలింది. 6వేల కిలోల బరువు ఉన్న ఐరన్‌ను దొంగిలించి భారీ వాహనంలో తరలించారని అధికారులు వివరించారు. బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ ఉద్యోగి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో కనుగొన్నారు.