భారతదేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబైకు నగరానికి మరో గౌరవం దక్కింది. ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరాల టాప్ టెన్ జాబితాలో ఇండియన్ సిటీస్ రెండు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలోను అత్యంత బిలియనీర్ల నగరాల జాబితాలో ముంబై మూడో స్థానంలో నిలిచింది. హురున్ రిసెర్చ్ ఇస్టిట్యూట్ ప్రకటించిన హురున్ గ్లోబల్ రిచ్ 2024 నివేదికలో ముంబై సిటీలో 93 మంది బిలియనీర్స్ ఉన్నారని తేలింది. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 26 మంది ముంబై సిటీలో, దేశవ్యాప్తంగా 94 మంది బిలియనీర్లు పెరిగారు.
ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా ఉంది. ఇది ఆసియాలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముంబై 3వ ర్యాంక్ దక్కించుకుంది. ఇది వరకు ఆ స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉండేది.. ఇప్పుడు ముంబై ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.
న్యూయార్క్ 119, లండన్ 97 మంది బిలియనీర్లతో ఫస్ట్, సెకండ్ ప్లేస్ ఆ రెండు నగరాలు ఉన్నాయి. తొలిసారిగా టాప్ టెన్ సిటీల్లో ఢిల్లీ నగరం కూడా ఈసారి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ $115 బిలియన్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ $86 బిలియన్ల సంపదతో ముంబైలోనే నివాసం ఉన్నారు. మొత్తం భారతదేశవ్యాప్తంగా 271 మంది బిలియనీర్లు (అల్ట్రా హై నెట్ వర్త్) ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశాల వారిగా చూసుకుంటే చైనా, అమెరికా తర్వాత ఇండియానే ఉంది.