ముంబై: రైల్వే ప్రయాణికులకు వసతుల కల్పన, రద్దీని నివారించేందుకు రైళ్లను పెంచాలని పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తేనుంది. ముంబై-కోల్హాపూర్, ఫుణె-వడోదర మధ్య రెండు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వడోదర-పుణె, ముంబై-కొల్హాపూర్ మార్గం ప్రస్తుతం నెట్ వర్క్ లో చేరితో ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగు పడుతుంది.
ప్రస్తుతం ముంబై సెంట్రల్ నుంచి గాంధీ నగర్ కు , ముంబై CSMT నుంచి మడ్గావ్ వరకు, ముంబై CSMT నుంచి షిరిడీ, ముంబై CSMT నుంచి షోలాపూర్ , ముంబై CSMT నుంచి జల్నా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముంబై CSMT నుంచి కొల్హాపూర్ లో CSMT నుంచి 5వ వందే భారత్ అవుతుంది.
వడోదర నుంచి పుణె కు వందే భారత్ రైలు వస్తే..
వడోదర నుంచి పుణె కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ప్రారంభ తేదీలను ఇంకా తెలుపలేదు. వడోదర నుంచి పుణే కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాకతో వసాయి రోడ్ కు అనుసంధానించడం ద్వారా ఈ ప్రాంతంలో రైలు నెట్ వర్క్ ను మరింత బలోపేతం అవుతుందన రైల్వే అధికారులు అంటున్నారు.