అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. 262 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లే లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ముకేశ్ కుమార్ ఇషాన్ కిషన్ ను పెవిలియన్ కు చేర్చాడు. వచ్చి రావడంతోనే మెరుపులు మెరిపించి సూర్య 13 బంతుల్లో 2 ఫోర్లు , 3 సిక్సులతో 26 పరుగులు చేసి పవర్ ప్లే చివరి బంతికి ఔటయ్యాడు.
దీంతో ఒక్కసారిగా ముంబై స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజ్ లో తిలక్ వర్మ (8), కెప్టెన్ హార్దిక్ పాండ్య (29) ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Suryakumar Yadav departs for 26(13)😶
— Sportskeeda (@Sportskeeda) April 27, 2024
Delhi Capitals are right at the 🔝🔥
MI - 65/3 (6)
📸: Jio Cinema#IPL2024 #CricketTwitter #DCvsMI pic.twitter.com/kYiBtc1O3G