ఈ రోజు అంటే జనవరి 26న తెల్లవారుజామున ముంబైలోని గ్రాంట్ రోడ్‌లోని కమాతిపురలోని ఒక రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సమీపంలోని మాల్, ఎత్తైన భవనాన్ని ఖాళీ చేయవలసి వచ్చిందని ముంబై ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ ఆవరణలో కాలిపోయిన మృతదేహాన్ని వెలికితీశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో.. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది.. మొత్తం 16 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఒక ఎత్తైన భవనం నుండి మొత్తం 16 ఫైర్ ఇంజన్లు, 2 లైన్లు పనిచేస్తున్నాయని, మంటల కారణంగా సమీపంలోని మాల్, భవనం ఖాళీ చేశారని ముంబై ఫైర్ సర్వీస్ తెలిపింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అంబ్ 108లోని బాత్రూమ్‌లో ఒక మగ వ్యక్తి కాలిపోయిన మృతదేహం కనుగొన్నామని అధికారులు తెలిపారు. గాయపడిన, తప్పిపోయిన ఇతర వ్యక్తుల గురించి విచారణ జరుగుతోందన్నారు.
#WATCH | Mumbai, Maharashtra: A fire broke out at a restaurant in Kamathipura, Grant Road at 2 am. Four fire tenders are on the spot. No injuries reported so far: Mumbai Fire Service pic.twitter.com/Pi2ZhWQTwL
— ANI (@ANI) January 25, 2024