దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి మెయిల్లో మళ్లీ హత్య బెదిరింపు వచ్చినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్లు పంపిన కేసులో 19 ఏళ్ల యువకుడిని ముంబైలోని గామ్దేవి పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేశారు.
పలు నివేదికల ప్రకారం, నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తిగా పోలీసులు గుర్తించారు. అతడికి నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంబానీకి ఈ వారం ప్రారంభంలో రూ. 400 కోట్లు డిమాండ్ చేసిన అదే మెయిల్లో ఈరోజు 'రిమైండర్' వచ్చింది. ఈసారి బెదిరింపు మెయిల్ మునుపటి బెదిరింపులను విస్మరించినందుకు తీవ్ర పరిణామాలుంటాయని అంబానీని హెచ్చరించింది.
"పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అక్టోబర్ 31, నవంబర్ 1 మధ్య రెండు బెదిరింపు మెయిల్లు వచ్చాయి. రూ. 400 కోట్లు డిమాండ్ చేసిన ఆ వ్యక్తి (మెయిల్ పంపినవారు).. మునుపటి మెయిల్లను విస్మరించినందుకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు" అని ముంబై పోలీసులు తెలిపారు.
గతంలో అంబానీకి ప్రాణహాని
అంతకుముందు బిజినెస్ మాగ్నెట్ అంబానీకి మూడోసారి హత్య బెదిరింపు వచ్చింది. ఈసారి రూ.400 కోట్లు డిమాండ్ చేశారు. మునుపటి మెయిల్ ఐడీతోనే ఈ సారి కూడా మెయిల్ వచ్చిందని., దోపిడీ మొత్తం మాత్రమే పెరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో దీంతో అంబానీ నివాసం అల్టామౌంట్ రోడ్డులోని యాంటిలియా చుట్టూ భద్రతను పెంచారు.
ALSO READ :- హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ (టన్నెల్) రోడ్లు : కాంగ్రెస్ విజన్ 2050