అమ్మాయిలతో డేంజర్ స్టంట్స్ వేసిన యువకుడు అరెస్ట్

ఇద్దరు అమ్మాయిలతో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన యువకుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. బాలికలతో కలిసి డేంజర్ స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 2న) 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో జరిగింది. నిందితుడు హిస్టరీ షీటర్ అని గుర్తించారు. అతడిపై ఆంటోప్ హిల్, వడాలా టిటి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. భారతీయ శిక్షాస్మృతి (IPC) 308, మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్లతో సహా కేసులు పెట్టారు.