కేసు దర్యాప్తు కోసం వెళ్తుండగా గుండెపోటు.. ఎయిర్​పోర్ట్​లో ముంబై పోలీస్​ మృతి

కేసు దర్యాప్తు కోసం వెళ్తుండగా గుండెపోటు.. ఎయిర్​పోర్ట్​లో ముంబై పోలీస్​ మృతి

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​ పోర్టులో గుండెపోటుతో  ముంబైకి చెందిన పోలీస్​ హెడ్​ కానిస్టేబుల్​ బుధవారం చనిపోయాడు.   ముంబై లోని కాలాచౌకి పోలీస్ స్టేషన్​లో పని చేస్తున్న  హెడ్ కానిస్టేబుల్  మహేష్ రామారావ్ సలుంకే (49),  స్టేషన్ ఎస్సై గణేశ్​, మరో మహిళ కానిస్టేబుల్  అక్కడి కేసు దర్యాప్తులో భాగంగా  కాన్పూర్​ వెళ్తున్నారు.

 ఈ క్రమంలో  బుధవారం ఉదయం 9 గంటలకు  శంషాబాద్ విమానాశ్రయంలో  కనెక్టింగ్​ ఫ్లయిట్​ కోసం గేట్ నెంబర్ 4  వేచి చూస్తుండగ.. మహేశ్​కు  ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను అక్కడే   పడిపోవడంతో వెంటనే సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించారు.  డాక్టర్లు  పరిశీలించి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడని తెలిపారు.  కలచౌకి ఎస్సై గణేష్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .