ముంబైకి బాంబు బెదిరింపులు

ముంబై: ముంబైలో బాంబు బెదిరింపు కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలకలం రేపాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు బెదిరింపు కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ముంబై పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాము బాంబులు పెట్టామని.. న్యూఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడుకలు జరుగుతున్న వేళ అవి ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చని బెదిరించాడు. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సిటీ మొత్తం విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐదు రోజుల క్రితం కూడా ముంబైలోని 11 చోట్ల బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అక్కడ తనిఖీలు జరిపిన పోలీసులు.. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని తేల్చారు.

ఫోన్​చేసింది అతనే..

బెదిరింపు కాల్​చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు గుర్తించారు. రాజ్​పేట్​పోలీస్ స్టేషన్​పరిధిలో ఉండే ఓ వ్యక్తే(32) శనివారం సాయంత్రం 112కి కాల్​చేసి బాంబులున్నాయని బెదిరించాడని, అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసులు తేల్చారు. ఈ మేరకు అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.